తెలంగాణలో బాలయ్య ఐదు రోజులపాటు ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్‌ ఖరారు

  • టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరనున్న హిందుపురం ఎమ్మెల్యే
  • ఈనెల 30న కూకట్‌పల్లిలో ప్రచారంతో పర్యటన ప్రారంభం
  • వరుసగా ఐదు రోజులపాటు కొనసాగనున్న కార్యక్రమం
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మహా కూటమిలో చేరి 12 స్థానాల నుంచి పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మద్దతుగా సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ట ఐదు రోజుల పాటు ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్‌ను పార్టీ వర్గాలు ఖరారు చేశాయి.

పార్టీ అభ్యర్థిగా కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తన అన్న హరికృష్ణ కూతురు నందమూరి సుహాసినికి మద్దతుగా ఈనెల 30వ తేదీన ప్రచారంతో తన పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. డిసెంబర్ 1న శేరిలింగంపల్లి, డిసెంబర్ 2న ఖమ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. డిసెంబర్ 3న మహబూబ్‌నగర్, మక్తల్, 4న రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, సనత్‌నగర్ అభ్యర్థుల తరుపున బాలకృష్ట ప్రచారం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Go Back to Shorts
Balakrishna
election campaign

More Telugu News